దేశంలోని పలు రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత రాష్ట్రాలైన అసోం, బిహార్, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులతో వర్చువల్గా సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో వరదల పరిస్థితులు, నైరుతి రుతుపవనాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై సమీక్షించారు.
వర్ష సూచన, హెచ్చరిక వ్యవస్థను మెరుగుపరచడానికి అధునాత సాంకేతికత పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు ప్రధాని మోదీ. అలాగే వరదలను అంచనా వేసేందుకు శాశ్వత వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్రాల సంస్థల మధ్య మంచి సమన్వయం అవసరమని తెలిపారు.