తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిమ్​స్టెక్​ నేతలతో మోదీ స్నేహగీతం

మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన బిమ్​స్టెక్​ దేశాధినేతలతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్​ ప్రధాని లొటాయ్ షెరింగ్​తో వేరువేరుగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.

బిమ్​స్టెక్​ నేతలతో మోదీ

By

Published : May 31, 2019, 3:47 PM IST

Updated : May 31, 2019, 7:45 PM IST

బిమ్​స్టెక్​ నేతలతో మోదీ స్నేహగీతం

బిమ్​స్టెక్​ దేశాధినేతలతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్ ప్రధాని లొటాయ్ షెరింగ్​తో దిల్లీలో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బంగ్లాదేశ్​ అధ్యక్షుడు అబ్దుల్ హమిద్​, మారిషస్​ ప్రధాని ప్రవీంద్ జగనాథ్​తోనూ భేటీ అయ్యారు మోదీ.

ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిమ్​స్టెక్​ దేశాలతో పాటు మారిషస్​, కిరిగిస్థాన్​ నేతలు హాజరయ్యారు.

శాంతిభద్రతలే అజెండా

శ్రీలంకలో ఈస్టర్​ దాడుల నేపథ్యంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం కట్టడిపై సిరిసేన, మోదీ చర్చించారు. హిందూ మహా సముద్ర ప్రాంతంలో పరిస్థితులపై సమాలోచనలు చేశారు.

"ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు సిరిసేనకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంక ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా మెలుగుతామని స్పష్టంచేశారు."
-భారత విదేశాంగ శాఖ

దృఢ సంబంధాలు

నేపాల్ ప్రధానితో...

ఇరు దేశాల వృద్ధిపై మారిషస్ ప్రధాని ప్రవీంద్​తో చర్చించారు మోదీ. నేపాల్​ ప్రధాని ఓలితో సమావేశం సందర్భంగా... రెండు దేశాల మధ్య దృఢ సంబంధాలు ఏర్పడాలని అభిలషించారు. భూటాన్​, బంగ్లాదేశ్​ దేశాధినేతలతోనూ మోదీ సమాలోచనలు జరిపారు.

భూటాన్​ ప్రధానితో...
భూటాన్​ ప్రధానితో...
బంగ్లాదేశ్ అధ్యక్షుడితో...
బంగ్లాదేశ్ అధ్యక్షుడితో...
కిరిగిస్థాన్​ అధ్యక్షుడితో..

షాంఘై సహకార సంస్థ​ అధ్యక్షుడు, కిరిగిస్థాన్​ అధ్యక్షుడు జీన్​బెకోవ్​తో మోదీ భేటీ అయ్యారు.

"కిరిగిస్థాన్​తో ఎన్నో ఏళ్లుగా మంచి సంబంధాలు కలిగి ఉన్నాం. వీటిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. "
-భారత విదేశాంగ శాఖ

భారత్​, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్​, భూటాన్​, థాయిలాండ్​ సభ్యులుగా 1997లో బిమ్​స్టెక్ కూటమి ఏర్పాటైంది. 150 కోట్ల జనాభా కలిగిన బిమ్​స్టెక్​ స్థూల దేశీయ ఉత్పత్తి 3.5 ట్రిలియన్​ డాలర్లు.

ఇదీ చూడండి: వైభవంగా కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం

Last Updated : May 31, 2019, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details