తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"ఐఏఎఫ్ సొమ్ము దొంగిలించారు" - రాహుల్​ గాంధీ

భారత వైమానిక దళానికి చెందిన రూ.30 వేల కోట్ల సొమ్ము ప్రధాని మోదీ దొంగిలించారని మరోసారి ఆరోపించారు రాహుల్​ గాంధీ.

ఐఏఎఫ్​ సొమ్మును మోదీ దొంగిలించారని రాహుల్​ ఆరోపణ

By

Published : Mar 2, 2019, 7:06 PM IST

ఐఏఎఫ్​ సొమ్మును మోదీ దొంగిలించారని రాహుల్​ ఆరోపణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. భారత వైమానిక దళానికి చెందిన రూ. 30 వేల కోట్లను దొంగిలించారని ఆరోపించారు.

జార్ఖండ్​ రాంచీలోని మోరబడి మైదానంలో జరిగిన పార్టీ 'పరివర్తన్​ ఉల్గులన్ మహా ర్యాలీ' కార్యక్రమంలో భాగంగా ప్రసంగించారు. రఫేల్​ ఒప్పందంలోని అవినీతి సొమ్మును అనిల్ అంబానీకి ఇచ్చారని ఆరోపించారు.

"వాయుసేనమన దేశాన్ని రక్షిస్తుంది. వాయుసేనకు చెందిన రూ.30వేల కోట్లను ప్రధానమంత్రి దొంగిలించి అనిల్​ అంబానీకి ఇచ్చారు. " - రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

పారిశ్రామికవేత్తలకు చెందిన రూ. 3.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధాని రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులకు ఏమీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయ పథకం అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.

ABOUT THE AUTHOR

...view details