కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఆయన ఇంటికి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌లో 1934లో జోషీ జన్మించారు.
అంతకు ముందు మనోహర్ జోషీ గురించి పలు విషయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు మోదీ. ఆయనతో చాలా సంవత్సరాలు కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు.