తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ ప్యాకేజీ భారీ శీర్షికతో కూడిన ఖాళీ పేజీ' - మోదీ ప్యాకేజీ భారీ శీర్షిక ఖాళీ పేజీలా ఉంది: చిదంబరం

కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం... మోదీ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీపై విమర్శలు గుప్పించారు. కేవలం శీర్షిక మాత్రం ఇచ్చి లోపల ఖాళీ పేజీ ఉంచారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించే ప్రతి రూపాయిని జాగ్రత్తగా లెక్కిస్తామన్నారు.

PM gave headline, blank page: Chidambaram on financial package
మోదీ ప్యాకేజీ.. భారీ శీర్షిక- ఖాళీ పేజీలా ఉంది: చిదంబరం

By

Published : May 13, 2020, 12:06 PM IST

Updated : May 13, 2020, 12:23 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ భారీ శీర్షకతో కూడిన ఖాళీ పేజీలా ఉందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత పి.చిదంబరం.

మోదీ ప్యాకేజీ భారీ శీర్షికతో కూడిన ఖాళీ పేజీ

"నిన్న, ప్రధానమంత్రి మనకు ఓ శీర్షికతో కూడిన ఖాళీ పేజీని ఇచ్చారు. అందుకే నా స్పందన కూడా ఖాళీగానే ఉంది."

- పి.చిదంబరం, కాంగ్రెస్ నేత

మోదీ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ అనే శీర్షిక కింద ఉన్న.... ఖాళీ పేజీని నింపే ఆర్థిక మంత్రి కోసం తాము ఎదురుచూస్తున్నామని చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రతి రూపాయి లెక్కిస్తాం..

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించే ప్రతి అదనపు రూపాయిని తాము లెక్కిస్తామని చిదంబరం అన్నారు. పేదరికంలో, ఆకలితో బాధపడుతున్న వారికి, వందల కిలోమీటర్ల నడిచి స్వగ్రామాలకు చేరుకుంటున్న వలస కార్మికులకు ఏ మేరకు లబ్ధి చేకూర్చుతారో చూస్తామని ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి:ఆర్థిక ప్యాకేజీని స్వాగతించిన ఉపరాష్ట్రపతి

Last Updated : May 13, 2020, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details