"ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన"ను నవంబర్ చివరి వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు మోదీ. ఫలితంగా 80కోట్ల మందికిపైగా ప్రజలకు ఉచితంగా అహార ధాన్యాలు అందుతాయని పేర్కొన్నారు.
అన్లాక్-2పై మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ ఈ విషయం వెల్లడించారు.
"వానాకాలంలో అన్నిటికన్నా వ్యవసాయ రంగంలో ఎక్కువ పని ఉంటుంది. పైగా జులై నుంచి ముఖ్య పండుగలు మొదలవుతాయి. గురు పూర్ణిమ, పంద్రాగస్టు, రక్షాబంధన్, శ్రీ కృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, దసరా తదితర పండుగలను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఫలితంగా అందరికీ అవసరాలు, ఖర్చులు పెరుగుతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను నవంబర్ చివరి వరకు పొడిగించాలని నిర్ణయించాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.