ఆర్థిక మందగమనం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆర్థిక వ్యవస్థపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని.. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సరైన అవగాహన లేదని ఎద్దేవా చేశారు.
ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో ట్విట్టర్ వేదికగా విమర్శల దాడిని తీవ్రం చేశారు రాహుల్ గాంధీ.