తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కిసాన్ రైలు​తో రైతు సాధికారత' - కిసాన్ రైలులో రైతులకు ఎంత సబ్సీడి

ప్రధాని నరేంద్ర మోదీ 100వ కిసాన్ రైలును ప్రారంభించారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి బంగాల్​లోని షాలీమార్ వరకు ఈ రైలు నడవనుంది. త్వరగా పాడయ్యే కూరగాయలు సహా వివిధ రకాల పండ్లను ఈ రైలులో రవాణా చేసుకునేందుకు వీలుంది.

PM flag off 100th Kisan Rail from Maharashtra to West Bengal
100వ కిసాన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

By

Published : Dec 28, 2020, 5:01 PM IST

Updated : Dec 28, 2020, 5:53 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ 100వ కిసాన్ రైలుకు సోమవారం పచ్చజెండా ఊపారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి బంగాల్​లోని షాలీమార్ వరకు వెళ్లే ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పియూష్ గోయల్ పాల్గొన్నారు. ఓ వైపు నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగుతుండగా.. మోదీ కిసాన్​ రైలును ప్రారంభించడం గమనార్హం.

రైతులు ఆదాయం పెంచి, వారిని సాధికారుల్ని చేసే దిశలో కిసాన్​ రైల్​ గొప్ప ముందడుగని మోదీ పేర్కొన్నారు.

ఈ మల్టీ కమోడిటీ రైలులో త్వరగా పాడయ్యే కూరగాయలైన.. కాలీఫ్లవర్​, క్యాప్సికమ్, క్యాబేజీ, ముల్లంగి, మిరప, ఉల్లి వంటి కూరగాయలు సహా.. ద్రాక్ష, నారింజ, అరటి, దానిమ్మ వంటి పండ్లను రవాణా చేసుకునేందుకు వీలుంది.

ఈ రైలు అగే అన్ని స్టేషన్లలో పండ్లు, కూరగాయలను ఎక్కించుకునేందుకు, దించుకునేందుకు అనుమతి ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. లోడ్​పై పరిమితులు లేవని తెలిపాయి. పండ్లు, కూరగాయల రవాణా ఛార్జీలపై ఉన్న సబ్సిడీని 50 శాతానికి పెంచినట్లు వివరించాయి.

ఆగస్టు 7న ప్రారంభించిన తొలి కిసాన్ రైలు​కు రైతుల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు వెల్లడిచారు. ఈ నేపథ్యంలో ఆ రైలును వారంలో మూడు రోజులు నడిపిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఈ రైలు​ వారానికి ఒకసారి మాత్రమే నడిచేది.

ఇదీ చూడండి:రైతులకు మద్దతుగా న్యాయవాది ఆత్మహత్య

Last Updated : Dec 28, 2020, 5:53 PM IST

ABOUT THE AUTHOR

...view details