తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశాకు మరో రూ.1000 కోట్లు సాయం: మోదీ - naveen patnaik

ఫొని విధ్వంసంతో అతలాకుతలమైన ఒడిశాకు సాయంగా మరో రూ.1000 కోట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. తుపాను ప్రభావిత ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా తిలకించిన తర్వాత రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మోదీ, పట్నాయక్

By

Published : May 6, 2019, 12:51 PM IST

Updated : May 6, 2019, 5:23 PM IST

మోదీ విహంగ వీక్షణం

ఒడిశాలో తుపాను సహాయక చర్యలకు సాయంగా మరో రూ.1000 కోట్లను అందిస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఫొని మిగిల్చిన నష్టాన్ని స్వయంగా తెలుసుకునేందుకు రాష్ట్రంలో పర్యటించింది ప్రధాని బృందం.

"వాతావరణ శాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు 8 రోజులగా సమన్వయంతో పనిచేశారు. సమీక్షలో అన్ని విషయాలపై చర్చించాం. తుపాను హెచ్చరికల నేపథ్యంలో రూ. 381 కోట్లను ఒడిశాకు తక్షణ సాయం అందించాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా అవసరమైన మరో రూ.1000కోట్లు అందిస్తున్నాం. తర్వాత కేంద్ర ప్రభుత్వ బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. పూర్తి నష్టాన్ని అంచనా వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అవసరమైన చర్యలపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించాను. ఇప్పుడు నాతో వచ్చిన పీఎంఓ బృందం ఈ రోజు ఇక్కడే ఉండి తక్షణ అంశాలను పరిశీలిస్తుంది."

Last Updated : May 6, 2019, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details