తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫొని ప్రభావిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్​ సర్వే - patnaik

ఫొని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు ప్రధాని నరేంద్రమోదీ. తుపాను కారణంగా వాటిల్లిన నష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. విహంగ వీక్షణంలో ప్రధానితో పాటు ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​ పాల్గొన్నారు.

మోదీ

By

Published : May 6, 2019, 11:05 AM IST

Updated : May 6, 2019, 11:26 AM IST

ఏరియల్​ సర్వే చేస్తున్న ప్రధాని

ప్రాంతాలను ప్రధాని నరేంద్రమోదీ విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. ఫొని విధ్వంసంతో జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకునేందుకు వచ్చిన ప్రధాని బృందంతోపాటు ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ ఏరియల్​ సర్వేలో పాల్గొన్నారు.

ఒడిశాలో ఫొని తుఫాన్​ ధాటికి 34 మంది మృత్యువాత పడ్డారు. తీరప్రాంతం పూర్తిగా దెబ్బతిన్నది. విద్యుత్​, టెలికం, నీటి వ్యవస్థలు ధ్వంసమయ్యాయి.

విహంగ వీక్షణం తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రధాని. నష్ట నివారణ, సేవల పునురుద్ధరణ వంటి విషయాలపై చర్చించారు. పర్యటనకు ముందు తుపాను బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రకటించారు మోదీ.

ఇదీ చూడండి:ఒడిశాలో 'ఫొని' మృతుల సంఖ్య 34కి చేరిక

Last Updated : May 6, 2019, 11:26 AM IST

ABOUT THE AUTHOR

...view details