తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' ప్రమాదంపై మోదీ, వెంకయ్య దిగ్భ్రాంతి

మహారాష్ట్ర రైలు ప్రమాద ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ట్వీట్​ చేశారు ప్రధాని. పీయూష్​ గోయల్​ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

PM condoles death of migrant workers in Maharashtra train accident
'మహా' రైలు ప్రమాదంపై మోదీ, వెంకయ్య దిగ్భ్రాంతి

By

Published : May 8, 2020, 9:45 AM IST

తెల్లవారుజామున మహారాష్ట్రలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన వెంకయ్య.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

ఉపరాష్ట్రపతి ట్వీట్​

రైలు ప్రమాదంలో దుర్మరణం చెందిన వలస కార్మికులకు ప్రధాని సంతాపం ప్రకటించారు. ఈ ఘటన తీవ్ర వేదనకు గురిచేసిందని ట్వీట్​ చేశారు. బాధితులకు అవసరమైన సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

మోదీ ట్వీట్​

''మహారాష్ట్రలో ఔరంగాబాద్​ రైలు ప్రమాద ఘటన తీవ్ర వేదనకు గురిచేసింది. వలస కూలీలు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. రైల్వే మంత్రి పీయూల్​ గోయల్​తో మాట్లాడా. ఆయన దగ్గరుండి సహాయచర్యలు పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం.''

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ABOUT THE AUTHOR

...view details