ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆయనకు ఎంతో ఇష్టమైన 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్'కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రజల్లో... ఒకరి సంస్కృతి పట్ల మరొకరికి అవగాహన కలిగించడమే దీని ఉద్దేశం.
"ఇవాళ మామల్లపురం నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ.. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమంలో పాల్గొన్నారు."- ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్
ప్రధాని మోదీ వ్యక్తిగతంగా 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమం కోసం చొరవ తీసుకున్నారు. దేశ వైవిధ్యాన్ని, సమగ్ర జాతీయ దృక్పథాన్ని మరింతగా ఇనుమడింపజేయడం... భారత దేశంలోని వివిధ సంస్కృతుల వేడుకలను ప్రోత్సహించడంఈ మిషన్ లక్ష్యం.