ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జాతీయ గంగా మండలి మొట్టమొదటిసారిగా సమావేశమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో నమామి గంగే ప్రాజెక్టు ద్వారా గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు. నదిని శుభ్రపరిచేందుకు తీసుకున్న చర్యల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మోదీ.
అనంతరం నమామి గంగే కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు ప్రధాని. గంగా తీరంలో నిర్మిస్తున్న అటల్ ఘాట్ పనుల పురోగతిని పరిశీలించారు. అర్ధగంటపాటు నదిలో ప్రయాణించారు మోదీ.