పీఎం కేర్స్ ఫండ్‌లోని రూ.3,100 కోట్లను కరోనాపై పోరుకు ఉపయోగించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టతనిచ్చింది. ఇందులోని రూ.2వేల కోట్లు వెంటిలేటర్ల కొనుగోళ్లకు, వేయి కోట్లు వలస కూలీల కోసం ఉపయోగించనున్నారు. మరో రూ.100 కోట్లను వ్యాక్సిన్ అభివృద్ధికి వినియోగించనున్నారు.
పీఎం కేర్స్ నిధులు దేనికి వాడుతున్నారంటే..? - pm care trust fund allocated for coronavirus crisis
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్లోని నిధులను ఖర్చు చేయడం మొదలుపెట్టారు. ఈ మేరకు రూ.3,100 కోట్లను ఎందుకు వాడుతున్నారో వెల్లడించింది ప్రధానమంత్రి కార్యాలయం.
పీఎం కేర్స్ నిధులు ఎందుకు వాడతారంటే..?
కొవిడ్-19 బాధితులకు అండగా ఉండాలనే సదుద్దేశంతో.. మార్చి 27న "ప్రైమ్ మినిస్టర్స్ సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్" (పీఎం కేర్స్) పేరిట నిధిని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇందులో రక్షణ మంత్రి, హోంమంత్రి, ఆర్థిక మంత్రి.. కీలక సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికీ ఈ కేర్స్‌కు.. పారిశ్రామికవేత్తలు, సంస్థలు, ప్రజల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి.
Last Updated : May 13, 2020, 9:37 PM IST