తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమిలి ఎన్నికలపై 19న అఖిలపక్ష భేటీ - వేడుకలు

పార్లమెంటులో ప్రాతినిధ్యమున్న దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ సమావేశం కానున్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నికలు, దేశ 75వ స్వాత్రంత్య వేడుకలు సహా పలు అంశాలపై ఈనెల 19న చర్చించనున్నారు.

జమిలి ఎన్నికలపై ఈనెల 19న అఖిలపక్ష భేటీ

By

Published : Jun 16, 2019, 3:08 PM IST

పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తోన్న పార్టీల అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఆయా పార్టీల అధ్యక్షులకు లేఖలు రాసింది. ఈనెల 19న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనుంది.

ప్రహ్లాద్​ జోషి, పార్లమెంటు వ్యవహారాల మంత్రి

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మోదీ తరఫున లేఖ రాశారు.

సమావేశం అజెండా...

  1. పార్లమెంటు ఔన్నత్యాన్ని పెంపొందించడం.
  2. ఒకే దేశం- ఒకే ఎన్నికలు
  3. 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా నవభారత నిర్మాణం
  4. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ.
  5. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి.

ఈ ఐదు అంశాలపై చర్చించేందుకు హాజరుకావాలని పార్టీ అధినేతలకు ఆహ్వానం పంపింది కేంద్రం.

ABOUT THE AUTHOR

...view details