తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అవినీతిని గుర్తించేలా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయాలి' - కాగ్ వార్తలు

ప్రభుత్వ విభాగాల్లో అవినీతిని గుర్తించేలా కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్​ (కాగ్​) నూతన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్​ను 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. కాగ్​ నిర్ణయాలు.. ప్రభుత్వ సమర్థత సహా అనేక అంశాలపై పడుతుందని.. పనితీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

By

Published : Nov 21, 2019, 8:47 PM IST

Updated : Nov 21, 2019, 11:30 PM IST

'అవినీతిని గుర్తించేలా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయాలి'

భారత్​ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్​ (కాగ్​) కీలక పాత్ర పోషించాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రభుత్వ విభాగాల్లో అవినీతిని గుర్తించేలా సృజనాత్మక సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

దిల్లీలో అకౌంటెంట్‌ జనరల్‌, ఉప అకౌంటెంట్‌ జనరల్ సదస్సులో పాల్గొన్నారు ప్రధాని. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు.. అందులో కాగ్​ పాత్రపై ప్రసంగించారు.

"ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో భారత్‌ ఒకటి. భారత్‌లో వేగంగా డిజిటల్‌ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. రికార్డుల నిర్వహణ ప్రక్రియ మారుతూ వస్తోంది. కాగ్‌ ఆడిటింగ్‌ ప్రక్రియలో కూడా చాలా పెద్ద మార్పు వచ్చింది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా బలపడేందుకు భారత్‌ మరింత దగ్గర అవుతోంది. దీనిలో కాగ్‌ భూమిక కూడా చాలా ఉంది. ఎందుకంటే మీరు చేసే పని ప్రభావం ప్రభుత్వ సమర్థత, నిర్ణయాలు తీసుకోవడం, విధాన నిర్ణయాల మీద పడుతుంది. మీరు ఏం చేసినా దాని ప్రభావం వ్యాపార సంస్థల సమర్థత మీద నేరుగా పడుతుంది. భారత్‌లోకి వచ్చే పెట్టుబడుల మీద, సులభతర వాణిజ్యం మీద ప్రభావం ఉంటుంది. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

సుపరిపాలనలో...

2022 నాటికి సాక్ష్యాలతో కూడిన విధానాలను రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు మోదీ. సుపరిపాలనలో కాగ్‌ కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాంకేతిక మార్పుల వల్ల.. లక్షా 50వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని వెల్లడించారు.

ఇదీ చూడండి: 'కొత్త ఎంవీ చట్టంతో రూ.577 కోట్ల చలాన్ల జారీ'

Last Updated : Nov 21, 2019, 11:30 PM IST

ABOUT THE AUTHOR

...view details