తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆత్మ నిర్భర్​ భారత్​'​ పాటపై మోదీ ప్రశంసలు - Prime Minister Narendra Modi

ఇటీవల జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ... స్వయం సమృద్ధి(ఆత్మ నిర్భర్​ భారత్) సాధించాలని పిలుపునిచ్చారు. దీనిని ప్రేరణగా తీసుకొని 'ఆత్మ నిర్భర్​ భారత్'​ కోసం రూపొందించిన పాటను ప్రముఖ గాయని లతా మంగేష్కర్​ ట్వీట్​ చేశారు. ఆ గీతంపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ.

PM appreciates song inspired by his call for 'atma-nirbhar' India
ఆత్మనిర్భర్​ భారత్​ పాటపై మోదీ ప్రశంసలు

By

Published : May 17, 2020, 11:40 PM IST

మహమ్మారి కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని 'ఆత్మ నిర్భర్​ భారత్' (స్వావలంబన భారత్​) సాధించడమే.. దేశ లక్ష్యమని జాతినుద్దేశించి చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మాటలను ప్రేరణగా తీసుకొని... ఇండియన్​ సింగర్స్​ రైట్స్​ అసోసియేషన్​(ఇస్రా)కు చెందిన 211 మంది గాయకులు ఓ పాట రూపొందించారు. దీనిని ప్రముఖ గాయని లతా మంగేష్కర్​ ట్వీట్‌ చేశారు. ఈ గేయంపై ప్రధాని ట్విట్టర్​ వేదికగా ప్రసంశలు జల్లు కురిపించారు.

"ఈ గీతం 'ఆత్మ నిర్భర్​ భారత్​ లేదా స్వావలంబన భారత్​' కోసం ప్రేరణ కలిగిస్తుంది." అని ట్వీట్ చేశారు మోదీ. ఈ గీతం అందరిలోనూ ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.

ఇదీ చూడండి:ఇజ్రాయెల్​ ప్రధానికి మోదీ శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details