తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే వ్యవస్థ కిందకు త్రివిధ దళాలు: మోదీ - స్వాతంత్ర్య దినోత్సవం

త్రివిధ దళాలను కలిపి ఒకే వ్యవస్థ కిందకు తీసుకొస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు మోదీ.

మోదీ

By

Published : Aug 15, 2019, 9:54 AM IST

Updated : Sep 27, 2019, 1:56 AM IST

దేశ భద్రతకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ప్రధాని నరేంద్రమోదీ. త్రివిధ దళాల మధ్య మరింత మెరుగైన సమన్వయం, సమర్థమైన నాయకత్వం కోసం చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​ పేరిట ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని మోదీ వెల్లడించారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"త్రివిధ దళాలకు ఒకే అధిపతి ఉండాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేసేందుకు ఈ చర్య ఎంతో దోహదం చేస్తుంది."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

విస్తృత సంప్రదింపుల తర్వాత...

పలు కమిటీల ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • ఈ ఆలోచనను 1999 కార్గిల్​ యుద్ధం తర్వాత రక్షణ శాఖకు ఉన్నత స్థాయి కమిటీ నివేదించింది. మూడు దళాల మధ్య అంతరం తొలగించేందుకు ఒకే అధిపతి ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది.
  • జాతీయ భద్రత విషయంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు చేసిన మంత్రుల బృందమూ ఇదే అంశాన్ని కీలకంగా ప్రస్తావించింది.
  • త్రివిధ దళాలకు ఉమ్మడి శాశ్వత ఛైర్మన్​ ఉండాల్సిన అవసరం ఉందని నరేశ్​ చంద్ర టాస్క్​ ఫోర్స్​ 2012లో సూచించింది. ఇందులో సైన్యం, నావికా దళం, వైమానిక దళ అధిపతుల్లో సీనియర్​ వ్యక్తిని ఛైర్మన్​గా నియమించాలని సిఫార్సు చేసింది.

ఇదీ చూడండి: 'జల్​ జీవన్​'తో ఇంటింటికీ తాగునీరు: మోదీ

Last Updated : Sep 27, 2019, 1:56 AM IST

ABOUT THE AUTHOR

...view details