మహమ్మారి కరోనా వల్ల దేశవ్యాప్తంగా దేవాలయాలను మూసివేశారు. అయితే వాటిని తిరిగి తెరవాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది గితార్థ్ గంగా ట్రస్ట్. భద్రతా మార్గదర్శకాలను జారీ చేస్తూ... ఆధ్యాత్మిక ప్రదేశాలను తిరిగి ప్రారంభించాలని పిటిషన్లో పేర్కొంది.
ఆధ్యాత్మిక ప్రదేశాలు తెరవాలంటూ సుప్రీంలో వ్యాజ్యం - సుప్రీం కోర్టులో పిల్
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా మూసివేసిన ఆధ్యాత్మిక ప్రదేశాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది గితార్థ్ గంగా ట్రస్ట్.
ఆధ్యాత్మిక ప్రదేశాలు తెరవాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్
'ఎక్కువమంది ఒకేచోట గుమిగూడకుండా భద్రతా మార్గదర్శకాలు జారీ చేస్తూ... ప్రోటోకాల్‌ను అనుసరించి మతపరమైన ప్రదేశాలను తెరవాలి. భక్తులు ఈ ప్రదేశాలను కూడా సందర్శించేలా ఏర్పాట్లు చేయాలి' అని పిటిషనర్ కోరారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లడం వల్ల కరోనా కారణంగా కలిగే మానసిక ఒత్తిడి తగ్గుతుందని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'కాంగ్రెస్‌లో సంక్షోభానికి కారణం అది కాదు'