తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వలస కూలీలకు అన్ని సదుపాయాలు కల్పించండి' - supreme court latest updates

దేశంలోని జిల్లాల్లో వలస కూలీలను గుర్తించి వారికి అన్ని సదుపాయాలను కల్పించేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. మహారాష్ట్ర రైలు ప్రమాదంలో వలస కూలీలు మరణించిన నేపథ్యంలో ఈ పిటిషన్​ దాఖలు చేశారు న్యాయవాది ఆలోక్ శ్రీవాత్సవ.

VIRUS-SC-MIGRANT WORKERS
'వలస కూలీలకు అన్ని సదుపాయాలు కల్పించండి'

By

Published : May 8, 2020, 7:36 PM IST

వలస కూలీలకు ఆశ్రయం, భోజన సదుపాయం, ఉచిత రవాణా కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. మహారాష్ట్ర ఔరంగాబాద్​లో ఇవాళ ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 16 మంది వలస కూలీలు మరణించిన నేపథ్యంలో న్యాయవాది ఆలోక్ శ్రీవాత్సవ పిటిషన్​ దాఖలు చేశారు.

"వలస కూలీలు రోడ్లపై తమ స్వస్థలాకు వెళ్లనివ్వద్దని.. వారికి తగిన సదుపాయాలు కల్పించాలని రాష్ట్రాలు, యూటీలను కేంద్రం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా దేశంలోని వలస కూలీలను గుర్తించి వారికి భోజనం, ఆశ్రయం కల్పించాలని జిల్లా పాలనాధికారులను ఆదేశించాలి. వారు స్వస్థలాకు వెళ్లేందుకు ఉచిత రవాణా ఏర్పాట్లు చేయాలి."

- ఆలోక్ శ్రీవాత్సవ, న్యాయవాది

ఔరంగాబాద్​ ప్రమాదాన్ని పిటిషన్​లో ప్రస్తావించారు ఆలోక్. వలస కూలీల విషయంలో ఎందుకు దృఢమైన చర్యలు తీసుకోలేదో కేంద్రాన్ని వివరణ కోరాలని కోర్టును అభ్యర్థించారు.

ఇదీ చూడండి:తెల్లారేసరికి 'కూలీ'న బతుకులు- నిద్దట్లోనే అనంతలోకాలకు

ABOUT THE AUTHOR

...view details