దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా నియమావళిని ఉల్లంఘించారని దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేపట్టింది ఆ రాష్ట్ర హైకోర్టు. ఈ పిటిషన్లపై వివరణ కోరుతూ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో పాటు ఎన్నికల కమిషన్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎమ్సీఎమ్సీ)కు జస్టిస్ వీకే రావుకు నోటీసులు జారీచేసింది.
సీఎం, డిప్యూటీ సీఎంకు హైకోర్టు నోటీసులు
ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నియమావళిని ఉల్లంఘించారంటూ దిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో వివరణ కోరుతూ కేజ్రివాల్, మనీశ్ సిసోడియాకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం.
దిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం లకు హైకోర్టు నోటీసులు
కేజ్రీవాల్, సిసోడియా పోలింగ్‌కు 48గంటల ముందు ఓటర్లను ప్రభావితం చేశారని తన పిటిషన్లో పేర్కొన్నారు చంద్ర అనే వ్యక్తి. ఈయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం, సెక్షన్-126 ప్రకారం ఇలాంటి వాటికి అనుమతి లేదని తెలిపారు చంద్ర. అభ్యర్థులిద్దరూ.. బస్టాండ్, జనసంచారం అధికంగా ఉండేచోట ఎన్నికల ప్రకటనల గోడపత్రికలను అతికించారని, పోలింగ్ రోజున కూడా ఓటర్లను ప్రభావితం చేశారని తన పిటిషన్లో పేర్కొన్నారు.
Last Updated : Mar 2, 2020, 6:27 PM IST