తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జడ్జీలను అగౌరవపరిచిన న్యాయవాదులపై చర్యలకు డిమాండ్

దిల్లీ జామియా యూనివర్సిటీ ఘటనపై దిల్లీ హైకోర్టు తీర్పును అగౌరవపరిచిన న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని పలువురు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. విచారణను కమిటీకి బదిలీ చేసింది న్యాయస్థానం.

delhi high court
జడ్జీలను అగౌరవపరిచిన న్యాయవాదులపై చర్యలకు డిమాండ్

By

Published : Dec 20, 2019, 12:43 PM IST

జామియా ఘటన కేసులో దిల్లీ హైకోర్టు తీర్పును అగౌరవపరచి.. జడ్జీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన న్యాయవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సీనియర్ అడ్వకేట్లు.

న్యాయవ్యవస్థను అవమానపరిచేలా ఆ న్యాయవాదుల వ్యాఖ్యలు ఉన్నాయని ధర్మాసనానికి తెలిపారు సీనియర్ న్యాయవాదులు. వాదనలు విన్న దిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణను సంబంధిత కమిటీకి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. నిర్ణయం కమిటీకే వదిలేసింది.

పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనల్లో భాగంగా జామియా వర్సిటీలో జరిగిన హింసాత్మక ఘటనల కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. విద్యార్థులకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించలేమని స్పష్టతనిచ్చింది న్యాయస్థానం. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. అయితే ఈ తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన విద్యార్థుల తరఫు న్యాయవాదులు అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి: 10 రోజుల తర్వాత అసోంలో ఇంటర్నెట్ సేవలు

ABOUT THE AUTHOR

...view details