తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లాస్టిక్​పై పోరు: జూలో 'స్టిక్కర్'​ ఐడియా సూపర్​ హిట్​ - chamarajendra zoological gardens

తమ పరిసరాలను ప్లాస్టిక్​ రహితంగా తీర్చిదిద్దడానికి సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది కర్ణాటకలోని చమరాజేంద్ర జూ పార్క్​ యంత్రాంగం. సందర్శకుల వద్ద ఉండే ప్లాస్టిక్​ వస్తువులకు బార్​కోడ్​ అతికించి.. వారి నుంచి రూ.10 సేకరిస్తోంది. వారు వెనుదిరిగే సమయంలో ఆ వస్తువులను చూపిస్తే ఆ 10 రూపాయలు వెనక్కి ఇస్తోంది. తద్వారా జూను పరిశుభ్రంగా ఉంచుతోంది.

PLastic campaign story of Chamarajendra Zoological Gardens
ప్లాస్టిక్​పై పోరు: జూలో 'స్టిక్కర్'​ ఐడియా సూపర్​ హిట్​

By

Published : Dec 28, 2019, 7:31 AM IST

ప్లాస్టిక్​పై పోరు: జూలో 'స్టిక్కర్'​ ఐడియా సూపర్​ హిట్​

ప్లాస్టిక్​ భూతం.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. నిత్య జీవితంలో ప్లాస్టిక్​ను నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం దక్కడం లేదు. ఇళ్లు, రోడ్లు, ఆలయాలు.. ఇలా ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్​ దర్శనమిస్తోంది. అయితే తమ పరిసరాలను శుభ్రంగా, ప్లాస్టిక్​ రహితంగా తీర్చిదిద్దడానికి కర్ణాటకలోని చమరాజేంద్ర జూ పార్క్​ సిబ్బంది సరికొత్త విధానాన్ని అమలు చేసి అద్భుత విజయం సాధించారు.

మైసూరులోని ఈ జంతు ప్రదర్శనశాలకు పర్యటకుల తాకిడి ఎక్కువే. పండుగలు, సెలవు దినాల్లో వీరి సంఖ్య 10వేలు దాటుతుంది. ఒకప్పుడు జూలో ఎక్కడ చూసినా సందర్శకులు తెచ్చిపడేసే ప్లాస్టిక్​ సీసాలు, ఇతర వ్యర్థాలు దర్శనమిచ్చేవి. అందుకే పర్యటకుల వద్ద ఉన్న ప్రతి ప్లాస్టిక్​ వస్తువుకు బార్​కోడ్​ స్టిక్కర్​ అతికించడం మొదలు పెట్టారు సిబ్బంది. ఒక్కో స్టిక్కర్​కు రూ.10 వసూలు చేస్తున్నారు. జూలో ఆహ్లాదంగా గడిపి వెనుదిరిగే సమయంలో వారి వద్ద ఉన్న ప్లాస్టిక్​ వస్తువులను చూపిస్తే... ఆ సొమ్మును తిరిగి అందజేస్తున్నారు.

"మా జూలో 1,500కు పైగా జంతువులు, పక్షులు ఉన్నాయి. ఏటా 20-25లక్షల మంది దీనిని సందర్శిస్తారు. అందువల్ల ప్లాస్టిక్​ కవర్లు ఎక్కడపడితే అక్కడ కనిపించేవి. నూతన చర్యల వల్ల ఈ పరిస్థితిని మార్చాం."
- అజిత్​ కులకర్ణి, జూ డైరక్టర్​.

ఈ పర్యావరణ హిత చర్యతో సందర్శకులు, స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది జూ యంత్రాంగం.

ABOUT THE AUTHOR

...view details