తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2020, 6:36 PM IST

Updated : Aug 6, 2020, 7:18 PM IST

ETV Bharat / bharat

'కరోనా రోగులపై పని చేయని ప్లాస్మా చికిత్స'

కరోనా సోకిన వారిపై ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలు ఇస్తోందన్న వాదనలు కొట్టిపారేసింది దిల్లీ ఎయిమ్స్​. ఈ చికిత్స రోగులపై పెద్దగా ప్రభావం చూపటం లేదని స్పష్టం చేసింది. ఇటీవలి ఫలితాల ప్రాథమిక విశ్లేషణ చేసి ఈ మేరకు వెల్లడించింది.

'Plasma therapy not helping Covid treatment'
'కరోనా రోగులపై పని చేయని ప్లాస్మా చికిత్స'

కరోనా రోగులపై ప్లాస్మా చికిత్స విధానం పెద్దగా ప్రభావం చూపించడం లేదని దిల్లీ ఎయిమ్స్‌ స్పష్టం చేసింది. కొవిడ్ రోగులపై నిర్వహించిన ప్లాస్మా చికిత్స ఫలితాల ప్రాథమిక విశ్లేషణలో ఈ మేరకు వెల్లడైందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రణదీప్‌ గులేరియా తెలిపారు.

" ప్లాస్మా చికిత్స ఫలితాన్ని అంచనా వేయడానికి 15 మంది కొవిడ్ రోగులతో కూడిన రెండు బృందాలపై పరిశీలన జరిపాం. అందులో ఒక బృందానికి సాధారణ విధానంలో చికిత్స అందించగా...మరో 15 మందికి సాధారణ పద్ధతితో పాటు ప్లాస్మా చికిత్సను అందించాం. ఈ రెండు విధానాల్లోనూ మరణాల రేటు సమానంగా ఉన్నట్లు తమ ప్రాథమిక విశ్లేషణలో తేలింది."

​ -డాక్టర్​ రణదీప్​ గులేరియా, దిల్లీ ఎయిమ్స్​ డైరెక్టర్​

అయితే దీనిపై స్పష్టత కోసం మరింత పరిశోధన అవసరమని తెలిపారు గులేరియా. ప్లాస్మా చికిత్స వల్ల కొవిడ్‌ రోగులకు ఎలాంటి ప్రమాదం లేదన్న ఆయన...అదే సమయంలో ప్రయోజనం కూడా ఏమి లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కొవిడ్​ పంజా: 40 వేలు దాటిన మృతుల సంఖ్య

Last Updated : Aug 6, 2020, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details