తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లాస్మా థెరపీ కరోనాను నిలువరించే మ్యాజిక్​ బుల్లెట్​ కాదు! - plasma therapy trials

కరోనా సోకిన వారికి ప్లాస్మా థెరపీ ద్వారా నయం చేయవచ్చని కొన్ని రాష్ట్రాలు భావిస్తున్న నేపథ్యంలో నిపుణులు హెచ్చిరిస్తున్నారు. వైర్​స్​ను నిలువరించగల మ్యాజిక్​ ఇందులో ఏమీ లేదని, అధిక సంఖ్యలో ట్రయల్స్​ నిర్వహించిన తర్వాతే ఓ అంచనాకు రావచ్చని చెబుతున్నారు.

Plasma therapy
ప్లాస్మా థెరపీ కరోనాను నిలువరించే మ్యాజిక్​ బుల్లెట్​ కాదు!

By

Published : May 4, 2020, 11:14 PM IST

కరోనా వైరస్ చికిత్సకు ప్లాస్మా థెరపీ విధానాన్ని పలు రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయి. ఈ పద్ధతిలో రోగులకు నయమవుతుందని భావిస్తున్నాయి. వైరస్​ను నిలువరించే సామర్థ్యం ప్లాస్మా థెరపీకి ఉన్నట్లు నిరూపితమవ్వాలంటే అనేక సంఖ్యలో ట్రయల్స్​ నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాతే ఓ అంచనాకు రావొచ్చని చెబుతున్నారు. వ్యాధిని కట్టడి చేసే మ్యాజిక్​ బుల్లెట్​ ఈ చికిత్సలో లేదని చెబుతున్నారు.

వైరస్​ సోకి కోలుకున్న వ్యక్తి రక్తంలోని రోగనిరోధకాలను మరో రోగి రక్తంలోకి పంపి చికిత్స అందించే విధానమే ప్లాస్మా థెరపీ. ఇలా చేస్తే మరో రోగిలో కూడా రోగనిరోధక శక్తి పెరిగి వైరస్​ను జయించే వీలుంది. ఈ విధానం ఇంకా ట్రయల్స్​లోనే ఉందని, రాష్ట్రాలు ఇప్పుడే దీనిని ప్రారంభించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవలే హెచ్చరించింది. దీని ద్వారా రోగులు జీవితకాలం క్లిష్ట ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని చెప్పింది.

రాష్ట్రాల ఆసక్తి..

అయితే రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, దిల్లీ మాత్రం ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. కొంత మందికి మాత్రమే ఈ చికిత్స అందించేందుకు కేంద్రం అనుమతిచ్చింది.

ప్లాస్మా థెరపీ ద్వారా కొవిడ్-19 చికిత్సలో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇంది ఎంతమేర ప్రభావం చూపిస్తుందో తెలియాలంటే అధిక సంఖ్యలో ట్రయల్స్ నిర్వహించాలన్నారు. అప్పుడే ఓ అంచనాకు రావచ్చని స్పష్టం చేస్తున్నారు.

ప్లాస్మా థెరపీ ద్వారా అతికొద్ది మంది కరోనా రోగులకు మాత్రమే చికిత్స అందించినట్లు తెలిపారు దిల్లీ ఎయిమ్స్​ డైరెక్టర్ రణ్​దీప్ గులేరియా. దీని ప్రయోజనం పొందిన వారు పదుల సంఖ్యలో కూడా లేరని చెప్పారు.

ప్లాస్మా థెరపీ ఓ చికిత్స విధానం మాత్రమే. వ్యక్తిలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. వైరస్​పై పోరాడేందుకు రోగ నిరోధకాలు సాయపడతాయి. దీని ద్వారా కరోనా చికిత్సలో భారీగా మార్పులేమీ రావు. ఇది ఒక మ్యాజిక్​ బుల్లెట్ వంటిదని ఓ పరిశోధనలోనూ నిరూపితమవ్వలేదు. ఇతర డ్రగ్స్​తో పాటు ఈ చికిత్స అందిస్తారు. ప్లాస్మా థెరపీపై ప్రయోగాలు నిర్వహించాలని చాలా సంస్థలనుభారత వైద్య పరిశోధన మండలి కోరింది. అందరి ప్లాస్మాలతో చికిత్స అందించలేం. అది సురక్షితమో కాదో తెలుసుకునేందుకు రక్త పరీక్షలు నిర్వహించాకే నిర్ణయం తీసుకోవాలి. కనీసం 300మందిపై ట్రయల్స్​ చేసి ఆ తర్వాత విశ్లేషించాలి.

-రణ్​దీప్ గులేరియా, ఎయిమ్స్​ డైరెక్టర్.

కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీ ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉందని చెప్పారు మరో వైద్య నిపుణులు డా. వివేక్ నాంగియా. కానీ ఆశాజనక ఫలితాలు వస్తున్నట్లు తెలిపారు. ఈ పద్దతి ద్వారా గతంలో సార్స్​, హెచ్​1ఎన్​1 వ్యాధిగ్రస్తులకు పరిమిత సంఖ్యలో చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. కరోనాకు ఇతర ప్రత్యామ్నాయ చికిత్సలు ఏవీ లేవన్నపుడే దీనిని ఎంచుకోవాలని స్పష్టం చేశారు.

దిల్లిలో ఓ వ్యక్తికి ప్లాస్మా థెరపీ చికిత్స అందించగా అతను వైరస్​ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్​ అయ్యాడు. మహారాష్ట్రలో కరోనా సోకిన వ్యక్తికి ఇదే పద్ధితిలో చికిత్స అందించగా కోలుకోలేక ప్రాణాలు కోల్పోయాడు.

ప్లాస్మా థెరపీ ట్రయల్స్ నిర్వహిస్తునే ఉంటామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ గతవారమే ప్రకటించారు. రాజస్థాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ట్రయల్స్​కు ఐసీఎంఆర్​ నుంచి తమకు అనుమతి లభించిందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details