తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదేళ్లయినా చెక్కుచెదరని మంగళ్​యాన్..! - మంగళ్​యాన్ పనితీరుపై ఇస్రో ప్రకటన

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంతరిక్ష ప్రాజెక్ట్​ మంగళ్​యాన్. అంగారకుడిపై పరిశోధనలు చేసేందుకు పంపిన ఈ ఉపగ్రహం జీవితకాలం ఆరునెలలు. కానీ ఐదేళ్లయినా చెక్కుచెదరకుండా పనిచేస్తుందని తెలిపారు ఇస్రో ఛైర్మన్ కె.శివన్

ఆర్నెల్లు అనుకుంటే ఐదేళ్లయినా చెక్కుచెదరలేదు..!

By

Published : Sep 25, 2019, 5:11 AM IST

Updated : Oct 1, 2019, 10:23 PM IST

ఐదేళ్లయినా చెక్కుచెదరని మంగళ్​యాన్..!

అంగారకుడిపై పరిశోధనల కోసం ఆరు నెలల జీవితకాలంతో పంపిన మిషన్ మంగళ్​యాన్​ ఐదేళ్లయినా చెక్కుచెదరకుండా పనిచేస్తోంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కె. శివన్. మరో గ్రహంపై పరిశోధనల కోసం భారతదేశం ప్రప్రథమంగా చేపట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్-మామ్ గత ఐదేళ్లలో అందించిన చిత్రాల ఆధారంగా మార్టిన్ అట్లాస్​ను రూపొందించేందుకు సహాయపడింది.

"మామ్ ఇంకా పనిచేస్తుంది. క్రమంగా చిత్రాలను పంపిస్తోంది. ఇంకా కొద్దికాలం పనిచేయనుంది."

-కె.శివన్, ఇస్రో ఛైర్మన్​

మంగళ్​యాన్-2 పై పనిచేస్తున్నామని అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇప్పటివరకు రెండు టెరాబైట్లు ఉన్న వేల చిత్రాలను ఇస్రోకు మార్స్ ఆర్బిటర్ పంపించింది.

మామ్.. భారత కీర్తి పతాక

ఫోబోస్, డిమోస్ అనే అంగారకుడి ఉపగ్రహాలను అత్యంత సమీపం నుంచి మార్స్ కలర్ కెమెరా (ఎంసీసీ) ద్వారా చిత్రించి పంపించింది మామ్​. అంగారకుడి చుట్టూ పరిభ్రమించే కృత్రిమ ఉపగ్రహాల్లో ఒకవైపు నుంచి పూర్తిచిత్రాన్ని, డిమోస్​లో కనిపించని భాగాన్ని కెమెరాల్లో బంధించగలిగిన సాంకేతికత ఉన్నది మామ్​కు మాత్రమే.

మామ్​ అందించిన డేటా ద్వారా 23 జర్నల్స్​లో విశ్లేషణలు ప్రచురితమయ్యాయి.

అంగారక గ్రహంపై దుమ్ము...

అంగారకుడిపై ఉన్న దుమ్ము రేణువులు వందల కిలోమీటర్ల పైకి విస్తరించి ఉంటాయని మామ్ ప్రయోగ ఫలితం ఆధారంగా ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్​ కిరణ్​ కుమార్ నాడు ప్రకటించారు.

హాలీవుడ్​ చిత్రం గ్రావిటీ, నాసా మావెన్ ఆర్బిటర్​ కంటే తక్కువ ఖర్చుతో మంగళ్​యాన్​ మిషన్​ను చేపట్టింది ఇస్రో. మంగళ్​యాన్ ప్రాజెక్ట్​కు మొత్తంగా అయిన ఖర్చు రూ. 450 కోట్లు.

ఇదీ చూడండి: విదేశీ విద్యార్థులు మెచ్చిన రాష్ట్రం ఏదో తెలుసా..?

Last Updated : Oct 1, 2019, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details