తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఐదు నెలల్లో కేరళ విమాన ప్రమాదంపై నివేదిక' - kerala plane crash updates

కేరళ విమాన ప్రమాద ఘటనపై విచారణకు ప్యానెల్​ను ఏర్పాటు చేసింది ఏఏఐబీ. 5 నెలల్లో నివేదిక వస్తుందని తెలిపింది. దర్యాప్తునకు సంబంధించి ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంటుందని చెప్పింది. బోయింగ్‌ 737 ఎన్‌జీ విమాన మాజీ పరిశీలకుడు కెప్టెన్‌ ఎస్​ఎస్​ చాహర్ ఈ ప్యానెల్‌కు‌ దర్యాప్తు ఇన్‌ఛార్జ్​గా వ్యవహరించనున్నారు.

plane crash enquiry panel to give report in 5 months
'ఐదు నెలల్లో కేరళ ప్రమాదంపై నివేదిక'

By

Published : Aug 14, 2020, 5:02 AM IST

కేరళ కోజికోడ్‌ విమాన ప్రమాదంపై ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ ప్యానెల్​ను‌ ఏర్పాటు చేసినట్లు విమాన ప్రమాద దర్యాప్తు బోర్డు(ఏఏఐబీ) తెలిపింది. ఈ ప్యానెల్‌ ఐదు నెలల్లో నివేదిక ఇస్తుందని పేర్కొంది. బోయింగ్‌ 737 ఎన్‌జీ విమాన మాజీ పరిశీలకుడు కెప్టెన్‌ ఎస్​ఎస్​ చాహర్ ఈ ప్యానెల్‌కు‌ దర్యాప్తు ఇన్‌ఛార్జ్​గా వ్యవహరించనున్నారు.

దర్యాప్తు ఇన్‌ ఛార్జి అవసరమైనప్పుడు నిపుణులు, ఇతర సంస్థల సహకారం తీసుకుంటారని ఏఏఐబీ తెలిపింది. దర్యాప్తునకు సంబంధించి ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంటుందని చెప్పింది. సంఘటనా స్థలం నుంచి ప్రయాణికులకు చెందిన 298 సామగ్రి ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది.

ఈ నెల 7న జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది చనిపోయారు. 92 మంది ప్రయాణికులు గాయాల నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఎర్రకోటలో స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details