తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తెలుగువారి అభివృద్ధే మా ఎన్నికల నినాదం' - vishaka zone

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులిచ్చిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. హైస్పీడ్ రైల్​ కారిడార్​లలో హైదరాబాద్​కు అవకాశముందని తెలిపారు. 'మై  భీ చౌకీదార్' కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్​కు వచ్చిన గోయల్ ఈనాడుకు ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు.

పీయూష్ గోయల్

By

Published : Mar 25, 2019, 9:54 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. ఈ విషయంలో ప్రజలను చైతన్య పరచటమే లక్ష్యంగా ఎన్నికల్లో పోరాటం చేస్తామని ప్రకటించారు గోయల్.

రెండు రాష్ట్రాల్లో భాజపా ఒంటరిగా పోటీ చేస్తోంది. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్న తెలంగాణలో ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారు?

గత ఎన్నికల్లో తెలంగాణలో ఒకటి, ఏపీలో రెండు స్థానాల్లో గెలిచాం. ఈ సారి మరిన్ని స్థానాల్లో విజయ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం. రెండు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులిచ్చింది. కేంద్ర పథకాలతో ప్రజలకు లబ్ధి జరిగింది.

అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికాంశాలు ప్రభావితం చేస్తాయి. లోక్‌సభ ఎన్నికలు దేశ ప్రధాని కోసం జరుగుతాయి. దేశ భద్రత, అభివృద్ధి, మంచి పాలన, నిజాయితీ గల నాయకత్వం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళతాం.

కొత్తగా 10 హైస్పీడ్ రైల్​ కారిడార్లలో హైదరాబాద్​ను విస్మరించారని తెరాస ఆరోపిస్తోంది. గుజరాత్​ మోదీ సొంత రాష్ట్రమైనందున 'అహ్మదాబాద్-ముంబయి' బులెట్​ ప్రాజెక్టు సాధ్యమైందని తెరాస అంటోంది.

కొత్త హైస్పీడ్‌ కారిడార్‌ ప్రాజెక్టులు ప్రతిపాదనలు మాత్రమే. ఇంకా ఖరారు కాలేదు. హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌- చెన్నై మధ్య సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ వచ్చేందుకు అవకాశాలున్నాయి. కేటీఆర్‌ నాకు మంచి మిత్రుడు. బులెట్‌ రైలు ప్రాజెక్టుపై మరింత అధ్యయనం చేసి రావాలని కోరుతున్నా. ఆయనకు ఫోన్‌చేసి మాట్లాడతా. అహ్మదాబాద్‌-ముంబయి బులెట్‌ రైలుపై యూపీఏ హయాంలోనే అధ్యయనం చేశారు. మోదీ ప్రభుత్వం వచ్చాక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో కాజీపేట, ఏపీలో తిరుమల బాలాజీ రైల్వే డివిజన్ల ఏర్పాటుపై ఉన్న డిమాండ్లు నెరవేరతాయా? విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ ఇచ్చినప్పటికీ 125 సంవత్సరాల వాల్తేర్‌ డివిజన్‌ను తొలగించారన్న విమర్శలూ ఉన్నాయి.

ప్రస్తుతానికి కాజీపేట, తిరుమల బాలాజీ వంటి కొత్త డివిజన్ల ఏర్పాటుకు అవకాశం లేదు. వాల్తేర్‌ను జోన్‌ ప్రధాన కార్యాలయంగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. పునర్విభజన చట్టంలో ఏపీకి కొత్త రైల్వేజోన్‌ను పరిశీలించాలని మాత్రమే ఉంది. ఆర్థికంగా, సాంకేతికంగా చాలా క్షుణ్నంగా పరిశీలించాం. అతికష్టం అయినప్పటికీ కొత్త జోన్‌ ఏర్పాటుచేశాం. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ కొందరు రాజకీయ నేతలు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఇదీ చూడండి:భారత్​ భేరి: 'నరేంద్రుడికి సాటి ఎవరు?'

ABOUT THE AUTHOR

...view details