పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా దిల్లీలోని షహీన్ బాగ్‌లో గత కొద్ది రోజులుగా ఆందోళనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి. మంగళవారం అక్కడకు ఓ వ్యక్తి తుపాకీతో రావడం కలకలం రేపింది. నిరసనలకారుల మధ్యలోకి వచ్చిన అతను తుపాకీని గాల్లోకి ఎత్తగానే అక్కడున్న వాళ్లంతా అడ్డుకున్నారు. పట్టుకునేందుకు ప్రయత్నించగా గందరగోళం మధ్యే వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు ఆ వ్యక్తి.
షహీన్‌బాగ్ నిరసనల్లో తుపాకీ కలకలం - shaheen bagh latest news
దేశ రాజధాని దిల్లీలోని షహీన్ బాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఓ వ్యక్తి తూపాకీ తీసుకురావడం కలకలం రేపింది. ఆందోళనకారుల మధ్యలో తుపాకీని గాల్లోకి ఎత్తగా... వాళ్లంతా అతడ్ని అడ్డుకున్నారు. గందరగోళం నడుమే అక్కడి నుంచి పరారయ్యాడు తుపాకీతో వచ్చిన వ్యక్తి.
షహీన్‌బాగ్ నిరసనల్లో తుపాకీ కలకలం
సమాచారం తెలుసుకున్న పోలీసులు తుపాకీతో వచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతని పేరు మమ్మద్ లుక్మాన్ అని.. అతడికి లైసెన్సు ఉన్న తుపాకీ ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. లుక్మాన్ స్థిరాస్తి వ్యాపారం చేస్తారని చెప్పాయి.
Last Updated : Feb 28, 2020, 10:07 AM IST