తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎయిర్​పోర్ట్ లీజు కోసం కేరళ అసెంబ్లీలో తీర్మానం - airport lease news

కేరళలోని త్రివేండ్రం విమానాశ్రయం నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం పినరయి విజయన్​. అంతకుముందు ఈ విషయంలో కలుగజేసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రేశారు.

pinarayi-vijayan
విమానాశ్రయ లీజు పునఃపరిశీలన కోరుతూ కేరళ అసెంబ్లీలో తీర్మానం

By

Published : Aug 24, 2020, 1:07 PM IST

త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ద్వారా ప్రైవేటు సంస్థకు అప్పగించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది కేరళ. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి పినరయి విజయన్​.

అంతకుముందు ఇదే విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు విజయన్​. ప్రైవేటు సంస్థలకు త్రివేండ్రం విమానాశ్రయ నిర్వహణ బాధ్యతల అప్పగింత నిర్ణయంపై పునఃపరిశీలించే అంశంలో కలుగజేసుకోవాలని కోరారు. అఖిలపక్ష పార్టీల సమావేశంలోనూ నేతలంతా విమానాశ్రయ నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోనే ఉండాలని ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన అఖిలపక్ష భేటీలో ఒక్క భాజపా మినహా.. మిగతా పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.

అవిశ్వాస తీర్మానం..

మరోవైపు.. ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కాంగ్రెస్​ ఎమ్మెల్యే వీడీ సతీషన్​. ఇందుకు స్పీకర్​ శ్రీరామక్రిష్ణనన్​ అనుమతించారు.

ఇదీ చూడండి:మరిన్ని విమానాశ్రయాల ప్రైవేటీకరణకు ప్రతిపాదనలు

ABOUT THE AUTHOR

...view details