శుక్రవారం నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం అశోక్ గహ్లోత్ నివాసంలో సీఎల్పీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి సచిన్ పైలట్ హాజరయ్యారు. గహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసి...తిరిగి రాజీకొచ్చిన తర్వాత వీరిద్దరూ సమావేశంకావడం ఇదే తొలిసారి. అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రకటించగా.. దాన్ని ఎదుర్కొనే అంశంపై కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.
గహ్లోత్ నివాసంలో సీఎల్పీ భేటీ.. హాజరైన పైలట్ - రాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి తెర
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నివాసంలో నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశానికి సచిన్ పైలట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు.
కాంగ్రెస్ గూటికి చేరుకున్న సచిన్ ఫైలెట్
పార్టీ నాయకులు కేసీ వేణుగోపాల్, అవినాష్ పాండే, రణదీప్ సుర్జేవాలా, అజయ్ మాకెన్, గోవింద్ సింగ్ దోతస్రా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.