తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేను కాంగ్రెస్​ విధేయుడినే: సచిన్​ పైలట్​ - రాజస్థాన్​ రాజకీయం

దాదాపు నెల రోజుల అనంతరం జైపుర్​లో అడుగుపెట్టారు కాంగ్రెస్​ నేత సచిన్​ పైలట్​. ఆయనకు మద్దతుదారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను కాంగ్రెస్​ కార్యకర్తనేనని.. పార్టీ ఏం చెబితే అది చేయడానికి సిద్ధమని వెల్లడించారు. ప్రతీకార రాజకీయాలకు మాత్రం చోటు ఉండకూడదని పేర్కొన్నారు.

Pilot backs in Jaipur, says there shouldn't be any vendetta politics
నేను కాంగ్రెస్​ విధేయుడిని: సచిన్​ పైలట్​

By

Published : Aug 11, 2020, 8:05 PM IST

తాను కాంగ్రెస్​ కార్యకర్తనేనని.. పార్టీ హైకమాండ్​ ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సచిన్​ పైలట్​ వెల్లడించారు. అయితే తాను ఎలాంటి పదవులకు డిమాండ్​ చేయలేదని స్పష్టం చేసిన పైలట్.​. ప్రతీకార రాజకీయాలకు చోటుండకూడదని అభిప్రాయపడ్డారు.

"నాపై వాడిన పదజాలం ఎంతో బాధ కలిగించింది. అలాంటి మాటలను మర్చిపోవడం మంచిదని అనుకుంటున్నా. రాజకీయాల్లో సమాచారాలు ఇచ్చిపుచ్చుకోవడం ఉండాలి. కానీ ప్రతీకార రాజకీయాలకు చోటుండకూడదు. సమస్యలు, విధానాల ఆధారంగా పని జరగాలి."

-- సచిన్​ పైలట్​, కాంగ్రెస్​ నేత.

మరోవైపు కాంగ్రెస్​పై తిరుగుబావుటా ఎగురువేసిన దాదాపు నెలరోజుల అనంతరం.. మంగళవారం జైపుర్​లో అడుగుపెట్టారు పైలట్​. ఆయనకు మద్దతుదారుల నుంచి ఘన స్వాగతం లభించింది.

ఇదీ జరిగింది...

రాజస్థాన్​ రాజకీయాలపై అసతృంప్తితో గత నెల రెబల్​గా మారారు సచిన్​ పైలట్​. తన బృందంతో కలిసి రాజస్థాన్​ను వీడారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ ప్రభుత్వంపై అనిశ్చితి నెలకొంది. అయితే పైలట్​ అనూహ్యంగా మనసు మార్చుకున్నారు. తిరిగి పార్టీలోకి వచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్​ అగ్రనేతలు రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details