తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విడాకుల్లో ఒకే విధానం కోరుతూ సుప్రీంలో వ్యాజ్యం

విడాకులు పొందేందుకు దేశంలోని పౌరులందరికీ ఒకే విధానం ఉండేలా చర్యలు తీసుకునే విధంగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ప్రస్తుతం ఉన్న విడాకుల చట్టాల్లోని వైరుధ్యాలను తొలగించాలని కోరారు పిటిషనర్​. మతం, లింగం, జాతి, పుట్టిన ప్రదేశం అనే పక్షపాతం లేకుండా ఒకే విధానం ఉండాలని విన్నవించారు.

PIL in SC seeks uniform grounds of divorce for all citizens
విడాకుల చట్టాల్లో వైరుధ్యాలపై సుప్రీంలో వ్యాజ్యం

By

Published : Aug 16, 2020, 5:05 PM IST

విడాకులు పొందేందుకు.. రాజ్యాంగం, అంతర్జాతీయ చట్టాల స్ఫూర్తితో దేశ పౌరులందరికీ ఒకే విధానం కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విడాకుల చట్టాల్లోని వైరుధ్యాలను తొలగించే విధంగా కేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు పిటిషనర్​, భాజపా నేత, న్యాయవాది అశ్విని కుమార్​ ఉపాధ్యాయ. మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి పక్షపాతం లేకుండా అందరికీ ఒకే విధానం అమలు చేయాలని అభ్యర్థించారు.

హిందూ, బౌద్ధ, సిక్కు, జైన్లు.. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం విడాకులు తీసుకుంటున్నారు. అలాగే ముస్లిం, క్రైస్తవులు, పార్సీలకు వేరువేరు చట్టాలు ఉన్నాయి. మతాంతర వివాహం చేసుకున్న దంపతులు ప్రత్యేక వివాహ చట్టం 1956, జీవితభాగస్వామి విదేశాలకు చెందిన వారైతే.. విదేశీ వివాహ చట్టం 1969 ప్రకారం విడాకులు కోరవచ్చు. కాబట్టి విడాకుల విధానం.. లింగభేదం లేదా మతాతీతమైనది కాదని పిటిషనర్​ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా భిన్నమైన విడాకుల విధానాలు ఆర్టికల్​14,15,21లను ఉల్లంఘిస్తున్నాయని.. పౌరులందరికీ ఒకే విధానం ఉండేలా మార్గదర్శకాలను కోర్టు జారీ చేసే అవకాశం ఉంది. అలాగే, ప్రస్తుత చట్టాలను పరిశీలించాలని.. మూడు నెలల్లో ఒకే విధానం రూపొందించాలని లా కమిషన్​కు సూచించొచ్చు.

ఇదీ చూడండి: ఐదు రూపాయల డాక్టర్​ ఇక లేరు

ABOUT THE AUTHOR

...view details