తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 'అన్న క్యాంటీన్ల'కై సుప్రీంలో పిటిషన్​

ఆహార కొరత, పోషకాహార లోపాన్ని అధిగమించడానికి కమ్యూనిటీ ఆహార కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆదేశాలివ్వాలని సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్​పై అత్యున్నత ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది.

సుప్రీంకోర్టు

By

Published : Sep 2, 2019, 6:45 AM IST

Updated : Sep 29, 2019, 3:27 AM IST

ఆహార కొరత, పోషకాహార లోపం సమస్యలపై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సమస్యను అధిగమించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కమ్యూనిటీ ఆహార కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆదేశాలివ్వాలని కోరారు పిటిషనర్లు.

సామాజిక కార్యకర్తలు అరుణ్​ ధావన్​, ఇషాన్ ధావన్​, కుంజనా సింగ్​లు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరపనుంది.

ఆహార గిడ్డంగులు...

ఆకలి, పోషకాహార లోపంతోఐదేళ్లలోపు చిన్నారులు ప్రతి రోజు ఎంతో మంది మరణిస్తున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు. అది ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లఘిస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు జాతీయ ఆహార గిడ్డంగులు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతమున్న పంపిణీ విధానం పరిధిని విస్తరించాలని విన్నవించారు.

ఆంధ్రప్రదేశ్​, ఉత్తరాఖండ్, ఒడిశా, ఝార్ఖండ్, దిల్లీలలో ఉన్న రాయితీ భోజన పథకాలను ఇందుకు ఉదాహరణగా చూపించారు.
ఆకలి మరణాలను నిర్మూలించేందుకు కొత్త పథకాన్ని రూపొందించి.. జాతీయ న్యాయ సేవా అథారిటీని ఆదేశించాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2కు ఆఖరి కక్ష్య కుదింపు

Last Updated : Sep 29, 2019, 3:27 AM IST

ABOUT THE AUTHOR

...view details