చైనాతో 2008లో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన వివరాలు బయటపెట్టనందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా, గోవా క్రానికల్ ఎడిటర్ సావియో రోడ్రిగ్స్ సంయుక్తంగా ఈ పిల్‌ను దాఖలు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం ప్రకారం ఎన్ఐఏ, సీబీఐ ద్వారా ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. చైనాతో శత్రు సంబంధం ఉన్నప్పటికీ.. ఆ దేశంతో ఒప్పందం చేసుకొని వాటి వివరాలను యూపీఏ ప్రభుత్వం దాచిపెట్టిందని పిటిషనర్లు ఆరోపించారు.
"జాతీయ ప్రాముఖ్యం ఉన్న విషయాల్లో పారదర్శకంగా వ్యవహరించడంలో కాంగ్రెస్ విఫలమైంది. జాతి ప్రయోజనాల విషయంలోనూ సమాచార హక్కును కొల్లగొట్టే అధికారం రాజకీయ పార్టీలకు ఉందా? శత్రు దేశంతో చేసుకున్న ఒప్పందం ద్వారా జాతి భద్రతను నాశనం చేయవచ్చా?"