తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తనపైనే 'కరోనా మందు' ప్రయోగం- శాస్త్రవేత్త మృతి - కరోనా మహమ్మారికి మందు

తమిళనాడుకు చెందిన ఓ ఫార్మసిస్టు కరోనా మహమ్మారికి ఔషధాన్ని కనిపెట్టానంటూ ఆ మందును తనపైనే ప్రయోగించుకున్నాడు. కానీ ఆ మందు వికటించటం వల్ల మృతి చెందాడు.

Pharmaceutical expert dies by taking pills claiming discovery of COVID-19 medicine
కరోనాకు ఔషదాన్ని కనిపెట్టి ..విగతజీవిగా మిగిలిన ఫార్మసిస్టు

By

Published : May 8, 2020, 5:06 PM IST

ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారికి మందు కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి. తను కూడా ఔషధాన్ని కనిపెడతానంటూ ఓ ప్రైవేట్​ ఫార్మసిస్టు రంగంలోకి దిగాడు. అనుకున్నదే తడవుగా నెల రోజుల పాటు శ్రమించి ఓ మందును తయారు చేశాడు. ఆ మందు పని తీరును తెలుసుకునేందుకు ముందుగా తనపైనే ప్రయోగించుకున్నాడు. కానీ ఆ ఔషధం వికటించి విగతజీవిగా మిగిలాడు. ఈ ఘటన చెన్నైలో జరిగింది.

ఇదీ జరిగింది.

తమిళనాడు పెరుంగుడికి చెందిన శివనేసన్​ ఉత్తరాఖండ్​లోని ఓ ప్రైవేట్​ ల్యాబ్​లో ప్రొడక్షన్​ మెనేజర్​. ఔషధాల తయారీలో ఆయన కీలక పాత్ర పోషించేవాడు. ఆ సంస్థ యాజమాన్యం అతడిని చెన్నై కొడంబక్కం భూపతి నగర్​లో ఉన్న శాఖలో విధులు నిర్వర్తించేందుకు పంపించింది.

కరోనా మహమ్మారికి తను కూడా ఔషధాన్ని కనిపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుని తయారు చేయటం ప్రారంభించాడు శివనేసన్​. కొన్ని నెలల పాటు సాగిన తన ప్రయత్నంలో పురోగతి సాధించినట్లు అందరికీ తెలియజేశాడు.

తను తయారు చేసిన ఔషధాన్ని పరీక్షించటం కోసం చెన్నై తైనాంపేట్​లో ఓ వైద్యుడి వద్దకు వెళ్లాడు. ఆ మందును తనపైనే ప్రయోగించుకున్నాడు. కొంత సమయం తర్వాత శివనేసన్ అకస్మారక స్థితికి వెళ్లటాన్ని గమనించిన ఆ వైద్యుడు.. వెంటనే ఒమాండురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఔషధం కోసం ఉపయోగించిన సోడియం నైట్రేట్​ వల్ల శివనేసన్ మరణించి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details