కొవిడ్-19 పరీక్షల పేరుతో పేద, అమాయక ప్రజల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు వసూలు చేసిన భారీ మొత్తాలను తిరిగి వారికి ఇప్పించాల్సిందిగా సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఒడిశా ప్రభుత్వం ఆర్టీ-పీసీఆర్ పరీక్ష కోసం రూ.400 మాత్రమే వసూలు చేస్తోందని, ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రులు మాత్రం రూ.4,500 వరకు వసూలు చేస్తున్నాయని పిటిషన్‌లో భాజపా నాయకుడు, న్యాయవాది అజయ్ అగర్వాల్ పేర్కొన్నారు.
కొవిడ్ పరీక్షల పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల దగా! - Petition on coronavirus test price
కరోనా పరీక్ష కోసం ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లు భారీ మొత్తాలను వసూలు చేస్తున్నాయని.. వాటిని తిరిగి బాధితులకు ఇప్పించాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆర్టీ-పీసీఆర్ పరీక్ష కోసం ఒడిశా ప్రభుత్వం కేవలం రూ.400 వసూలు చేస్తోందని... ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లు రూ.4,500 వరకు వసూలు చేస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా నిర్ధరణకు చేసే ఆర్టీ-పీసీఆర్ పరీక్షల ధరను రూ.400గా నిర్ణయించాలని ఇప్పటికే అగర్వాల్ సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. గత నెల 24న కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తాజా పిటిషన్‌లో.. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల పేరుతో బీద, అమాయక ప్రజలను ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు మోసం చేశాయని అగర్వాల్ పేర్కొన్నారు. వారి నుంచి భారీ మొత్తాలను వసూలు చేశాయని ఆరోపించారు.
ఇదీ చూడండి:'కాంగ్రెస్తో చేతులు కలిపి ప్రజల్లో నమ్మకం కోల్పోయా'