సీఆర్పీఎఫ్ దళం అంటే.. సాధారంగా దేశ అంతర్గత భద్రత కోసమే పని చేస్తుందని తెలుసు. మావోయిస్టుల ఏరివేత, అల్లర్ల కట్టడి వంటి భద్రతా చర్యల్లో సీఆర్పీఎఫ్ది చాలా కీలక పాత్ర. భూకంపాలు, వరదల వంటి ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ ఈ దళం సేవలు అందిస్తూ ఉంటుంది. ఇవి మాత్రమే కాదు.. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో సైతం పాల్గొంటోంది సీఆర్పీఎఫ్. మాస్కులు, పీపీఈ కిట్ల తయారీ సహా వాటిని అవసరమైన వారికి అందించే చర్యల్లో పాలుపంచుకుంటోంది.
మాస్కులు కుడుతూ.. కరోనా యుద్ధాన్ని జయిస్తూ - సీఆర్పీఎఫ్
కరోనా మహమ్మారిని జయించేందుకు సీఆర్పీఎఫ్ జవాన్లు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఓవైపు తుపాకీ పట్టుకుని సరిహద్దులో గస్తీ కాస్తూనే.. మరోవైపు మాస్కులు, పీపీఈ కిట్లు తయారు చేస్తున్నారు. అవసరమైన వారికి వీటిని పంపిణీ చేస్తున్నారు.

మాస్కులు కుడుతూ.. కరోనా యుద్ధాన్ని జయిస్తూ
జమ్ముకశ్మీర్ కేంద్రంగా పని చేస్తున్న పలు సీఆర్పీఎఫ్ యూనిట్లు ఇప్పుడు ఇవే పనుల్లో నిమగ్నమయ్యాయి. అవసరమైన వారికి వాటిని అందిస్తూ సేవా భావాన్ని చాటుకుంటున్నాయి. రోజువారీ విధులు నిర్వహిస్తూనే మాస్కులను కుట్టడం, పీపీఈ కిట్ల తయారీ పనుల్లో నిమగ్నం అవుతున్నారు సిబ్బంది. ఓ ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసి పేదలకు నిత్యావసర వస్తువులను సైతం అందజేస్తున్నారు జమ్ముకశ్మీర్‌లోని సీఆర్పీఎఫ్ సిబ్బంది.
మాస్కులు కుడుతూ.. కరోనా యుద్ధాన్ని జయిస్తూ
ఇదీ చూడండి:-రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సైనికాధికారుల మృతి
Last Updated : Sep 12, 2020, 9:52 PM IST