తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అధికారుల పనితీరు ప్రమాణాలను మెరుగుపరుస్తాం' - 'minimum government and maximum governance'.

దిల్లీలోని డీఆర్​డీవో కార్యాలయంలో రక్షణశాఖ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్​ ఫినాన్స్​ వర్క్​షాప్​ జరిగింది. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​  'తక్కువ ప్రభుత్వం- గరిష్ఠ పరిపాలన' లో భాగంగా అధికారుల పని తీరులో ప్రమాణాలు మెరుగు పరచటం, ఆర్థిక నిర్వహణలో క్రియాశీలమైన విధానాలను అభివృద్ధి చేయటమే ప్రభుత్వ లక్ష్యమని రాజ్​నాథ్​ వెల్లడించారు.

Performance standards being set for officers under 'min govt, max governance': Rajnath
'అధికారుల పనితీరు ప్రమాణాలను మెరుగుపరుస్తాం'

By

Published : Dec 24, 2019, 11:20 PM IST

'తక్కువ ప్రభుత్వం- గరిష్ఠ పరిపాలన'లో భాగంగా అధికారుల పనితీరు ప్రమాణాలను మెరుగుపరచటం, ఆర్ధిక నిర్వహణలో క్రియాశీలమైన విధానాలను అభివృద్ధి చేయటమే కేంద్ర ప్రభుత్వం ముఖ్య ధ్యేయమని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక విభాగం ఆధ్వర్యంలో దిల్లీలోని డీఆర్​డీవో కార్యాలయంలో 'ఇంటిగ్రేటెడ్​ ఫినాన్స్​ సలహాదారుల వర్క్​షాపు'ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు రాజ్​నాథ్​.

"కేంద్ర బడ్జెట్​లో 1/4 వంతు రక్షణ శాఖకు కేటాయిస్తున్నాం, అన్ని విభాగాలకు, మంత్రిత్వశాఖలు ఇంటిగ్రేటెడ్​ ఫినాన్స్​ వెన్నెముకల నిలుస్తోంది. అన్ని మంత్రిత్వ శాఖలు ఎటువంటి రాజీ పడకుండా బడ్జెట్​లోని నిధులను సక్రమంగా వినియోగించినప్పుడే తమ ధ్యేయాలను, లక్ష్యాలను సాధించగలుగుతాయి."
-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

500 కోట్ల ఆదాయం...

గత మూడేళ్లలో రక్షణ శాఖకు మూలధనం, ఆదాయ సేకరణ, ఆర్ధిక పరమైన అధికారాలు ఇవ్వటం వల్ల 500 కోట్ల ఆదాయాన్ని సొంతంగా సేకరించినట్లు మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి:గవర్నర్​ను కలిసిన సోరెన్​.. 29న ప్రమాణస్వీకారం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details