జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ను దేశంలో అమలు చేయనివ్వబోమని, ప్రజలు అందుకు అనుమతించరంటూ ఉద్ఘాటించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగుతున్న నిరసనల్లో విధ్వంసానికి పాల్పడిన వారిపై.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రియాంక ప్రస్తావించారు. మొదట ఎవరు హింసకు పాల్పడుతున్నారో గుర్తించాలన్నారు. ఎటువంటి దర్యాప్తు లేకుండా యూపీ ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు.
"ఎన్ఆర్సీ.. పౌరసత్వాన్ని నిర్ధరించే ధ్రువీకరణ పత్రం కాదు. పౌరసత్వ ధ్రువీకరణ పత్రంతో ఎన్ఆర్సీకి ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీన్ని ఇప్పటికే అమలు చేయనివ్వబోమని చెప్పారు."