తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యం ప్రియులను 'ఏప్రిల్​ ఫూల్స్​' చేసిన వైన్​ షాపు - latest corona upates

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో అన్ని మద్యం దుకాణాలు మూసేశారు. అప్పటి నుంచి మందు బాబులు దాహంతో పిచ్చెక్కిపోతున్నారు. అయితే కర్ణాటకలో ఓ వైన్​ షాపు ఏప్రిల్​ 1న మద్యం అమ్మనున్నట్లు తెలిసింది. అంతే పెద్ద సంఖ్యలో దుకాణం ఎదుట క్యూ కట్టారు. తీరా నిజం తెలిశాక వారు పడిన బాధ అంతా ఇంతా కాదు.

Tipplers fall prey to April Fool's day prank in Karnataka town
మద్యం ప్రియులను ఏప్రిల్​ ఫూల్స్​ చేసిన వైన్​ షాపు

By

Published : Apr 1, 2020, 3:17 PM IST

క్యూ కట్టిన మద్యం ప్రియులు

కర్ణాటకలో ఓ మద్యం​ దుకాణం.. మందు బాబులను ఏప్రిల్ ఫూల్స్​ చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా దేశమంతటా లాక్​డౌన్​ విధించిన క్రమంలో.. అన్ని లిక్కర్​ షాపులు మూసేశారు. చాలా రోజులుగా దాహంతో అల్లాడుతున్న మద్యం ప్రియులకు ఆశ రేకెత్తించేలా.. గడగ్​ పట్టణంలో బుధవారం మద్యం దుకాణాలు తెరుచుకుంటాయనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అంతే చుట్టుపక్కల ప్రాంతాల్లోని మందు బాబులంతా ములగంద్​ రోడ్డు సమీపంలోని వైన్​ షాపు ఎదుట క్యూ కట్టారు. అది కూడా ఎలాంటి తోపులాట లేకుండా.. క్రమశిక్షణ పాటిస్తూ నిలబడ్డారు. వీరిలో మహిళలు, యువత, వృద్ధులు కూడా ఉన్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మద్యం దుకాణం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇదంతా అబద్దం అని తెలిశాక.. పాపం మందు బాబులంతా నిరాశతో వెనుతిరిగారు.

మద్యం లేక మృతి

ఇటీవలే లాక్​డౌన్​తో మందు దొరక్కపోవడం వల్ల.. చాలా మంది మద్యం ప్రియులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఘటనలు ఎక్కువగా జరిగాయి.

ABOUT THE AUTHOR

...view details