కర్ణాటక చిత్రదుర్గలో ఓ ఎలుగుబంటిపై గ్రామస్థులు కర్రలతో దాడి చేసి చంపారు. దళవాయికట్టెలో చొరబడిన ఎలుగు గ్రామస్థులపై దాడి చేసింది. 50 ఏళ్ల రాజన్న మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఎలుగుబంటిని కర్రలతో కొట్టి చంపిన గ్రామస్థులు - dalavayikatte village in karnataka
కర్ణాటక చిత్రదుర్గలో గ్రామస్థుడిపై దాడి చేసి చంపినందుకు ఎలుగుబంటిని తీవ్రంగా కర్రలతో కొట్టి హతమార్చారు దళవాయికట్టె వాసులు. ఎలుగును పట్టుకోవటంలో అటవీ అధికారులు విఫలమవగా చంపాలని నిర్ణయించారు గ్రామస్థులు.

ఎలుగుబంటి
ఎలుగుబంటిని కర్రలతో కొట్టి చంపిన గ్రామస్థులు
అటవీ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్థులు. ఎలుగును పట్టుకోవటంలో అధికారులు విఫలమైన నేపథ్యంలో అగ్రహించిన గ్రామస్థులు వేటాడారు. ఓ తోటలో వన్యమృగం కనిపించగానే మూకుమ్మడిగా కర్రలతో దాడి చేసి చంపారు.
ఇదీ చూడండి: శునకాల పెళ్లికి ఊళ్లో పెద్దల హడావుడి!
Last Updated : Sep 30, 2019, 2:28 PM IST