'2021 ఎన్నికల్లో అద్భుతం'.. రజనీ సంచలన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. రానున్న శాసనసభ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు. 'మక్కల్ నీది మయ్యం' పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్‌తో జట్టుకట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు రజనీ. ఈ సందర్భంగా.. 2021 ఎన్నికల్లో తమిళ ప్రజలు అద్భుతాలు సృష్టిస్తారని వ్యాఖ్యానించారు.
"2021లో తమిళనాడు ప్రజలు.. రాజకీయాల్లో 100 శాతం ఒక పెద్ద అద్భుతాన్ని సృష్టిస్తారు."
- రజనీకాంత్
ఎంఎన్ఎం పార్టీతో భాగస్వామ్యం, ఎవరు ముఖ్యమంత్రి అనే విషయాలపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు రజనీ.
అన్నాడీఎంకే అధికారంలోకి రావడమే 'అద్భుతం'
2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు అద్భుతాన్ని సృష్టిస్తారని రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ముఖ్యమంత్రి పళనిస్వామి. రజనీ మాటల్లోని అర్థం.. రానున్న ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడమే అద్భుతమని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:కమల్-రజనీపై అన్నాడీఎంకే 'టామ్ అండ్ జెర్రీ' పంచ్