రాజస్థాన్ రాజకీయ పరిణామాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత వసుంధరా రాజే తొలిసారిగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ లోపాలకు.. ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ సంక్షోభానికి.. భాజపాకు సంబంధం లేదని తేల్చిచెప్పారు.
"ఈ వ్యవహారంలో భాజపాను, భాజపా నేతలను మధ్యలోకి తీసుకురావడంలో అసలు అర్థమే లేదు. కాంగ్రెస్లో లోపాలు, కరోనాపై ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి భాజపాపై నిందలు వేస్తున్నారు. రైతుల పంటలపై మిడతలు దాడి చేస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ తప్పులకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు."
-వసుంధరా రాజే, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి.
ప్రజలే ముఖ్యమని.. వారి సమస్యలను పరిష్కరించడమే ప్రాధాన్యమని వెల్లండించారు రాజే.