బిహార్ ప్రజలు సుపరిపాలన అందించే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వయం ఉపాధి పొందే యువతకు కొత్త అవకాశాలు సహా ప్రజలకు భద్రత, ఉపాధిని ఎన్డీఏ మాత్రమే అందిస్తుందన్నారు.
రాష్ట్రంలోని యువత, మహిళలు ఎల్లప్పుడూ ఎన్డీఏతోనే ఉన్నారని, తమ కూటమిపైనే నమ్మకాన్ని పెట్టుకున్నారని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేశారు మోదీ.
" ససరామ్లో తొలి ర్యాలీ నుంచి సహర్సాలోని చివరి ర్యాలీ వరకు, ప్రజలు ఎంతో ప్రేమను అందించారు. బిహార్ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య విలువలను సుప్రీంగా పరిగణించింది. కాబట్టి, బిహార్ ప్రజలు కేవలం సుపరిపాలన అందించే రాజకీయాలనే ఇష్టపడతారు. యువత, మహిళలు అధిక స్థాయిలో పాలుపంచుకుంటారు. ఎన్డీఏ ఎప్పుడూ విజయం సాధిస్తుందంటే.. అది వారి మద్దతు కారణంగానే. చట్ట పాలనను కొనసాగించటం, పేదల సంక్షేమమే ఆత్మనిర్భర్ బిహార్ లక్ష్యం. "