తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంపన్​ ఎఫెక్ట్​: బంగాల్​లో 86కు చేరిన మృతులు

అంపన్‌ తుపాను బంగాల్​ రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. రాష్ట్రంలో ఈ విపత్తు కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 86కు చేరింది. కరెంటు, మంచినీళ్ల సరఫరా లేకపోవడం వల్ల ఆగ్రహం చెందిన ప్రజలు.. రోడ్లపై నిరసనలు చేపట్టారు.

amphan affect
అంపన్​ ఎఫెక్ట్​: బంగాల్​లో 86కు చేరిన మృతుల సంఖ్య

By

Published : May 23, 2020, 1:28 PM IST

అంపన్​ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న బంగాల్​ ఇంకా కోలుకోలేదు. ఈ తుపాను కారణంగా రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 86కు చేరింది. పలు చోట్ల ఇంకా కరెంటు, మంచినీటి సరఫరా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపైనే చెట్లు కూలడం వల్ల రవాణా సదుపాయాలు అందుబాటులోకి రాలేదు. మూడు రోజులవుతున్నా పరిస్థితులు చక్కదిద్దలేకపోయారని ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై నిరసనలు చేపట్టారు. మమతా బెనర్జీ నేడు తుపాను దెబ్బకు తీవ్రంగా ప్రభావితమైన దక్షిణ 24 పరగణాల జిలాల్లో పర్యటించనున్నారు.

తూపాను ధాటికి నేలకూలిన చెట్లు

బాధితులు భారీగానే...

తుపాను దెబ్బకు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేల కొలది చెట్లు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. దాదాపు 1.5 కోట్ల మందిపై తుపాను ప్రభావం పడినట్లు అధికారులు అంచనా వేశారు. దాదాపు 6 జిల్లాలు ఇంకా నిర్బంధంలోనే ఉన్నట్లు తెలిపారు.

తూపాను ధాటికి నేలకూలిన చెట్లు

కోల్​కతా, దక్షిణ, ఉత్తర 24 పరగణాల జిలాల్లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు, మొబైల్​ కమ్యునికేషన్​ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చాలా చోట్ల విద్యుత్​ స్తంభాలు నేలకొరగడం వల్ల వాటి పునరుద్ధరణ చర్యలు చేపట్టినా పూర్తిగా కరెంటు సరఫరా లేక కొన్ని ప్రాంతాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి.

తూపాను ధాటికి నేలకూలిన చెట్లు

ఇళ్ల పైకప్పులు దెబ్బతినడం వల్ల తార్పాలిన్​ షీట్లు ఇవ్వాలని కోరినా.. ప్రభుత్వం స్పందించట్లేదని మండిపడ్డారు కక్​ద్వీప్​ ప్రజలు. మూడు రోజులుగా ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హింగల్​గంజ్​ ​ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల ప్రభుత్వం పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసినా.. అవన్నీ వేల మందితో కిక్కిరిసిపోయాయి.

తూపాను ధాటికి నేలకూలిన చెట్లు

మరో వారంలో...

వారంలో ప్రాంతాలన్నీ యథాతథంగా మారతాయని, అందుకు మున్సిపల్​ సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నట్లు చెప్పింది కోల్​కతా మున్సిపల్​ విభాగం. 5 వేల చెట్లు కూలి చాలా రహదారులు మూసుకుపోయాయని.. వాటిని తొలగించే పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపింది. ఎన్​డీఆర్​ఎఫ్​ సహా రాష్ట్రంలోని విపత్తు సహాయక బృందాలు యద్ధప్రాతిపదికన పనిచేస్తున్నాయి.

తూపాను ధాటికి నేలకూలిన చెట్లు

శుక్రవారం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్​ సర్వే నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ, బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. అనంతరం కేంద్రం తరఫున తక్షణ సాయంగా రూ.1000 కోట్లు ప్రకటించారు. తుపాను సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి మమతా ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు విడుదల చేశారు.

తూపాను ధాటికి నేలకూలిన చెట్లు

మే 26 వరకు రైళ్లు వద్దు...

అంపన్​ కారణంగా ఇబ్బందుల్లో ఉన్నబంగాల్​కు మే 26 వరకు శ్రామిక్​ రైళ్లు నడపొద్దని కేంద్రాన్ని కోరింది మమతా సర్కార్​. అధికారులంతా సహాయకచర్యల్లో నిమగ్నం అవడం వల్ల కార్మికుల విషయంలో దృష్టి సారించడం కష్టమని తెలిపింది. మే 1 నుంచి ఈ రాష్ట్రానికి 25 ప్రత్యేకరైళ్లు నడిచాయి.

ABOUT THE AUTHOR

...view details