నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఏం జరిగిందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని పేర్కొన్నారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నేతాజీ కనిపించకుండాపోయి నేటికి సరిగ్గా 74 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఆచూకీపై ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
"1945 ఆగస్టు 18న తైవాన్‌లోని తైహోకు విమానాశ్రయం నుంచి నేతాజీ బయలుదేరారు. అప్పుడే ఆయన కనిపించకుండా పోయారు. ఆయనకు ఏం జరిగిందో ఇప్పటికీ తెలియదు. గొప్ప భూమిపుత్రుడి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది."
-మమతా బెనర్జీ, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి.
తైవాన్ నుంచి బయలుదేరిన విమానం కూలిపోయి నేతాజీ చనిపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. కానీ దానికి తగిన సాక్ష్యాలు చూపించలేకపోయాయి.