తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లి కోసం ఐదేళ్ల బాలుడి ఒంటరి ప్రయాణం

లాక్​డౌన్ దిల్లీలో ఉండిపోయిన ఐదేళ్ల బాలుడు బెంగళూరుకు ఒంటరిగా ప్రయాణం చేశాడు. ఇన్ని రోజులు బంధువుల ఇంట్లో ఉండిపోయిన అతడు.. విమాన ప్రయాణాలు పునఃప్రారంభం కావడం వల్ల తన తల్లిని కలుసుకునేందుకు బెంగళూరుకు చేరుకున్నాడు. ప్రత్యేక కేటగిరీ ప్రయాణికుడిగా బాలుడికి ప్రయాణ అనుమతులు ఇచ్చారు అధికారులు.

lock down 5 years boy from delhi to bengaluru
తల్లి కోసం ఐదేళ్ల బాలుడి ఒంటరి ప్రయాణం!

By

Published : May 25, 2020, 6:37 PM IST

Updated : May 25, 2020, 7:56 PM IST

తల్లి కోసం ఐదేళ్ల బాలుడి ఒంటరి ప్రయాణం

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ప్రజా రవాణా లేక ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ 4.0లో భాగంగా నిబంధనల మేరకు ప్రజా రవాణాకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే రైళ్లు, బస్సులు నడుస్తుండగా, సోమవారం నుంచి దేశీయంగా విమాన ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తన తల్లిని కలుసుకునేందుకు ఐదేళ్ల బాలుడు ఒంటరిగా దిల్లీ నుంచి బెంగళూరు విమాన ప్రయాణం చేశాడు.

స్పెషల్ కేటగిరీ ప్లకార్డుతో బాలుడు

సోమవారం దిల్లీ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల్లో ఐదేళ్ల బాలుడు విహాన్‌ శర్మ కూడా ఉన్నాడు. మూడు నెలల క్రితం దిల్లీ వెళ్లిన విహాన్‌ లాక్‌డౌన్‌ కారణంగా అక్కడ బంధువుల ఇంట్లోనే ఉండిపోయాడు. సోమవారం విమానాలు పునః ప్రారంభంకావడం వల్ల తన తల్లిని కలుసుకునేందుకు బెంగళూరు చేరుకున్నాడు. ప్రత్యేక కేటగిరీ ప్రయాణికుడిగా విహాన్‌కు అధికారులు అనుమతి ఇచ్చారు. విహాన్‌ బెంగళూరు చేరుకున్న సందర్భంగా అతడి తల్లి ఆనందంతో అక్కున చేర్చుకుంది.

బాలుడిని వెంటతీసుకొని వెళ్తున్న తల్లి
Last Updated : May 25, 2020, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details