అధికారం కోసం శివసేనతో జట్టు కట్టబోమని స్పష్టం చేశారు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ఓటమికి చేరువలో ఉన్న నేపథ్యంలో ముంబయిలో మీడియాతో మాట్లాడారు శరద్ పవార్. ప్రజల తీర్పుపై సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు పవార్. అయితే... తాము మరిన్ని స్థానాలు గెలుస్తామని భావించామని.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాలేదని పేర్కొన్నారు. విపక్షాలపై ప్రభుత్వ విధానాలను తట్టుకొని రాణించామన్నారు ఎన్సీపీ అధినేత.
అధికారం కోసం శివసేనతో కలిసేది లేదు: పవార్ - maharashtra assembly election results 2019
మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తామని తెలిపారు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్. అయితే అధికారం కోసం శివసేనతో కలిసేది లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తు ప్రణాళికలపై కాంగ్రెస్‌తో పాటు కూటమిలోని ఇతర పార్టీలతో కలిసి చర్చిస్తామన్నారు.
అధికారం కోసం శివసేనతో కలిసేది లేదు: పవార్
"ప్రజల తీర్పును గౌరవిస్తాం. కానీ గత ఎన్నికల్లో మాకు దూరమైన ప్రజలు ప్రస్తుతం మమ్మల్ని అంగీకరించారు. మమ్మల్ని ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు. భవిష్యత్తు ప్రణాళికలపై కాంగ్రెస్‌తో పాటు కూటమిలోని ఇతర పార్టీలతో కలిసి చర్చిస్తాం. అధికారం కోసం శివసేనతో కలిసేది లేదు."
-శరద్ పవార్, ఎన్సీపీ అధినేత