తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.30కే వాటర్​ ఫిల్టర్​ను తయారు చేసిన యువకుడు - నిరంజన్​ కరాగి

కేవలం 30 పైసలకు 1 లీటర్​ నీటిని శుభ్రపరిచే ఫిల్టర్​ను తయారు చేశాడు కర్ణాటక బెళగావికి చెందిన నిరంజన్​ కరాగి. ఈ ఫిల్టర్​ ఖరీదు రూ.30 నుంచి రూ.2500 ఉంటుందని తెలిపాడు. ఇప్పటి వరకు మొత్తం 2 లక్షల ఫిల్టర్లను తయారు చేసి.. భారత్​ సహా అమెరికా, మలేసియా వంటి 15 దేశాలకు ఎగుమతి చేసినట్లు వెల్లడించాడు నిరంజన్​.

People Can Get the One Litre Water in Just 30 Paisa
రూ.30లకు వాటర్​ ఫిల్టర్​ను తయారు చేసిన యువకుడు

By

Published : Sep 29, 2020, 6:47 PM IST

భూమి మీద నివసించే ప్రతి ప్రాణికి గాలి ఎంత అవసరమో.. నీరు అంతే ముఖ్యం. పూర్వ కాలంలో ప్రజలు, జంతువులు స్వచ్ఛమైన నీటిని తాగేవారు. అలాగే ధరణిపై పుష్కలంగా మంచినీరు ఉండేది. రాను రాను నీటి కొరత ఏర్పడుతోంది. దొరుకుతున్న కొద్ది పాటి జలం కూడా కలుషితమవుతోంది. భూమి నుంచి వచ్చే నీటిని నేరుగా కాకుండా ఫిల్టర్​ చేసుకొని తాగుతున్నారు ప్రజలు. ఈ పద్ధతి చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ధనవంతులు తప్ప పేదవాళ్లు దీనిని ఉపయోగించుకోలేకపోతున్నారు. దీంతో కలుషిత నీటినే తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారు పేద ప్రజలు.

నిరంజన్​ కరాగి

ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాడు కర్ణాటక బెళగావికి చెందిన నిరంజన్​ కరాగి. అతి తక్కువ ఖర్చుతో వాటర్​ ఫిల్టర్​ను తయారు చేశాడు. ఇంజినీరింగ్​ చదివిన అతను వాటర్​ ఫిల్టర్ పనితీరు గురించి క్షుణ్నంగా అధ్యయనం చేసి.. నూతన నమూనాతో ఫిల్టర్​ను రూపొందించాడు. దీనితో కేవలం 30 పైసలకు 1 లీటరు నీటిని శుద్ధి చేయొచ్చని చెప్తున్నాడు.

రూ.30లకు వాటర్​ ఫిల్టర్​ను తయారు చేసిన యువకుడు

ఈ వాటర్ ఫిల్టర్‌ నిర్నల్ బ్రాండ్ పేరిట మార్కెట్‌లోనూ విక్రయిస్తున్నాడు నిరంజన్. ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా ఫిల్టర్లను తయారు చేశాడు. దీని తయారీతో పాటు తన పరిశ్రమలో స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నాడు.

ఆలోచన ఎలా వచ్చింది?

నిరంజన్​ మెకానికల్​ ఇంజినీరింగ్​ చదివే సమయంలో.. తన ఇంటి సమీపంగా ఉన్న ప్రభుత్వ పాఠాశాల విద్యార్థులు కలుషిత నీటిని తాగడం గమనించాడు. ఆ సంఘటనే తనకు స్ఫూర్తి నిచ్చిందని చెప్పుకొచ్చాడు.

మిగతా వాటికి దీనికీ తేడా ఏంటంటే...

మార్కెట్లో వివిధ అంతర్జాతీయ సంస్థలకు చెందిన చాలా వాటర్ ఫిల్టర్లు దొరుకుతున్నాయి. కానీ అవన్నీ చాలా ఖరీదైనవి. వాటిని ఇళ్లు లేదా కార్యాలయంలో మాత్రమే ఉపయోగించటానికి వీలవుతుంది. నిరంజన్​ రూపొందించిన ఫిల్టర్​ను 30 నుంచి 2500 రూపాయలకు లభించేలా అందుబాటులోకి తీసుకువచ్చాడు. దీనిని బాటిల్స్, ట్యాప్, ఇతర డ్రమ్ము​లకు బిగించి ఉపయోగించుకోవచ్చు. ఈ ఫిల్టర్‌కు విద్యుత్ అవసరం లేదు. ఇది సెకను వ్యవధిలోనే వైరస్, బాక్టీరియాలను నాశనం చేయగలదని నిరంజన్​ చెబుతున్నాడు.

మొదటి 50 ఆవిష్కరణలలో నిర్మల్ ఫిల్టర్ స్థానం

విదేశాలకు ఎగుమతి...

ఈ వాటర్ ఫిల్టర్ తయారు చేయటానికి కర్ణాటక ప్రభుత్వం, స్టార్టప్ ఇండియా, స్మార్ట్ అప్ మహారాష్ట్ర, ఇతర కంపెనీలు సహాయం చేసినట్లు నిరంజన్‌ తెలిపాడు. 30 రూపాయలతో తయారు చేసిన ఈ ఫిల్టర్..​ 100 లీటర్ల నీటిని శుద్ధి చేయగలదు. ఈ విధంగా ఒక లీటర్ స్వచ్ఛమైన నీటికి 30 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ ఫిల్టర్ ఇప్పటికే అమెరికా, మలేసియా, శ్రీలంకతో సహా 15 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు చెప్పాడు.

నిర్నల్ వాటర్ ఫిల్టర్ దేశంలోని వివిధ ప్రాంతాలలో అమ్ముడవుతోంది. సీఆర్​పీఎఫ్​ కమాండర్లు కూడా దీనినే ఉపయోగిస్తున్నారు. వివిధ దేశాల నంచి 160 మంది ఔత్సాహికులు పాల్గొన్న వరల్డ్ ఇన్నోవేషన్ కాంగ్రెస్ 2020 పోటీలో.. మొదటి 50 ఆవిష్కరణలలో నిర్మల్ ఫిల్టర్ ఒకటిగా నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details